: ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ హఠాన్మరణం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటీష్ పాప్ సింగర్ జార్జ్ మైఖేల్ హఠాన్మరణం చెందాడు. ఇంగ్లండ్ లోని గోరింగ్ లో ఉన్న నివాసంలో ఆయన చనిపోయినట్టు అతని కుటుంబీకులు థేమ్స్ వ్యాలీ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ద్వారా తెలిపారు. ఇంట్లో క్రిస్మస్ సంబరాలు ముగిసిన వెంటనే ఆయన చనిపోయినట్టు వెల్లడించారు. క్రిస్మస్ పర్వదినాన ప్రశాంత మరణం పొందాడని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మరణం పట్ల అనవసరమైన వ్యాఖ్యలు ఏమీ చేయడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో అనుమానం తాలూకు ప్రశ్నలు ఏవీ అడగవద్దని కోరారు. మైఖేల్ వయసు 53 సంవత్సరాలు.

1981లో ఆండ్రూ రిగ్దేలితో కలసి వామ్ (WHAM) అనే బ్యూజిక్ సంస్థను మైఖేల్ స్థాపించాడు. అయితే, అప్పటికే ఇదే పేరుతో అమెరికాలో కూడా ఓ సంస్థ ఉండటంతో... ఈ పేరు వివాదాస్పదమయింది. అంతేకాదు, ఆయన చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి. అయితే, పాప్ సింగర్ గా అంతులేని ఖ్యాతిని మైఖేల్ సంపాదించుకున్నాడు.

More Telugu News