: చైనానే కాదు యూరప్ ను కూడా టార్గెట్ చేయగల... అగ్ని-5 ప్రయోగం సక్సెస్

అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి అగ్ని-5ను నేడు పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణిని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ నాటి పరీక్షలో ప్రధానంగా గైడెడ్, నావిగేషన్ వ్యవస్థలను పరీక్షించారు. మరికొన్ని పరీక్షల అనంతరం భారత సైన్యం అమ్ములపొదిలోకి ఈ క్షిపణులు చేరుతాయి.

అగ్ని-5 క్షిపణి ప్రత్యేకతలు ఇవే...

  • వెయ్యి కేజీల వార్ హెడ్ ను ఈ మిసైల్ మోసుకుపోగలదు. దీని రేంజ్ 5వేల కిలోమీటర్లు. 
  • పాకిస్థాన్, చైనా, యూరోప్ లోని పలు ప్రాంతాలను ఈ క్షిపణి ఛేదించగలదు. 
  • దీని పొడవు 17 మీటర్లు. బరువు 50 టన్నులు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థకు చెందినది. 
  • ఉపరితలం నుంచి ఉపరితలానికి దీన్ని ప్రయోగించగలం.  అత్యాధునిక ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థ ఉండటంతో... శత్రు వ్యవస్థలు దీని ఆగమనాన్ని పసిగట్టడం చాలా కష్టం. 
  • భారత్ 35 దేశాల మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ లో సభ్యత్వం పొందిన తర్వాత అగ్ని-5కు నిర్వహించిన తొలి పరీక్ష ఇది. 
  • అగ్ని-6 క్షిపణి ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉంది. దీని రేంజ్ 8వేల నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. సబ్ మెరైన్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించేలా సిద్ధం చేస్తున్నారు. 

More Telugu News