: చచ్చేంత వరకు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా: హాస్యనటుడు సప్తగిరి

సినిమా ఇండస్ట్రీ అంటే తనకు ఇష్టమని, ఇక్కడ పనిచేయాలనే వచ్చానని..ఇక్కడే తనకు అన్నీ దొరికాయని.. చచ్చేంతవరకు సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి చెప్పాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను దర్శకుడిని కావాలని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, ఏడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేశానని చెప్పాడు. తాను హండ్రెడ్ పర్సెంట్ కమెడియన్ ని అయితే కాదని అన్నాడు. తనకు ఉన్న కాన్పిడెన్స్ వల్లే అసిస్టెంట్ డైరెక్టర్ గా, హాస్యనటుడిగా ఆ తర్వాత హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటించానని, తనకు కావాల్సిన విధంగా తాను ఉండగలనని చెప్పాడు. 

More Telugu News