: కొత్త స్కీములు ప్రకటించిన మోదీ... ధన్ వ్యాపారి యోజన, లక్కీ గ్రాహక్

నగదు రహిత లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు రెండు సరికొత్త పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2016 సంవత్సరపు చివరి 'మన్ కీ బాత్'లో భాగంగా ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా ప్రసంగించిన ఆయన, ధన్ వ్యాపారి యోజన, లక్కీ గ్రాహక్ స్కీములను ప్రకటించారు. వీటిల్లో భాగంగా 100 రోజుల పాటు అటు వ్యాపారులు, ఇటు డిజిటల్ లావాదేవీలు జరిపే ప్రజలను ప్రోత్సహిస్తామని తెలిపారు. నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలు 300 శాతం పెరిగాయని మోదీ గుర్తు చేశారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు మొబైల్ చెల్లింపు మాధ్యమాలను వినియోగిస్తే, మరింత ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు. ఆన్ లైన్ లావాదేవీలకు ఐటీ రాయితీలను దగ్గర చేస్తామని తెలిపారు.

More Telugu News