: మరో ఘనత... యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ పరీక్ష విజయవంతం

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరనుంది. ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ లో సరికొత్త స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతమైంది. 2013లో ప్రభుత్వం చేపట్టిన 'సావ్' ప్రాజెక్టులో భాగంగా ఈ ఆయుధాన్ని డీఆర్డీఓ తయారు చేసింది. 120 కిలోల బరువుండే ఈ క్షిపణిని యుద్ధ విమానంలో తీసుకెళ్లి, 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయవచ్చు. అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి వ్యవస్థ లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. క్షిపణి ప్రయోగం, లక్ష్యఛేదనను రాడార్లతో పరీక్షించామని అధికారులు తెలిపారు. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ డారిన్-2 యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించారు.

More Telugu News