: వలసల ప్రభావం: అమెరికా నుంచి మెక్సికో, చైనా, భారత్ కు అత్యధిక డాలర్లు తరలివెళ్లాయి: ప్రపంచబ్యాంక్

బతుకుదెరువు కోసం పాతిక కోట్ల మంది ప్రజలు స్వదేశాన్ని వీడి విదేశాల్లో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వారంతా సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని స్వదేశంలోని కుటుంబీకులకు పంపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి 19 శాతం మంది వలసదారులు స్వదేశాలకు పంపిన డబ్బు వివరాలను వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. 1990 నుంచి ఇలా అమెరికా నుంచి పంపిన మొత్తాలను పరిశీలిస్తే 2015 సంవత్సరానికి ఎంతో పెరిగాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. కేవలం 2015 సంవత్సరంలోనే ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లిన నిధుల మొత్తం 58, 200 కోట్ల డాలర్లని వరల్డ్ బ్యాంక్‌ తో పాటు ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ కూడా పేర్కొంది. 2015 సంవత్సరంలో 13,350 కోట్ల డాలర్లు ఇతర దేశాలకు వెళ్లాయిని వరల్డ్ బ్యాంక్ చెప్పింది.

ఈ నిధులు ప్రధానంగా అభివద్ధి చెందిన దేశాల నుంచి అభివద్ధి చెందుతున్న వర్ధమాన దేశాలకు తరలుతున్నాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఇలా తరలుతున్న నిధుల వివరాల్లోకి వెళ్తే... అమెరికా నుంచి మెక్సికోకు 2,430 కోట్ల డాలర్లు, చైనాకు 1,620 కోట్ల డాలర్లు, భారత్‌ కు వెయ్యి కోట్ల డాలర్లు బదిలీ అయ్యాయని తెలిపింది. దాని తరువాతి స్థానంలో సౌదీ నుంచి 4,570 కోట్ల డాలర్లు, దాని తరువాత జర్మనీ నుంచి 2,280 కోట్ల డాలర్లు వెళ్లగా, దాని తరువాతి స్థానంలో పోలాండ్‌ నుంచి 210 కోట్ల డాలర్లు, ఫ్రాన్స్‌ నుంచి 190 కోట్ల డాలర్లు, ఇటలీ నుంచి 130 కోట్ల డాలర్లు ఈ దేశాలకు తరలాయని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. పేద దేశాల నుంచి కూడా నిధులు తరలడం విశేషం. ఆ జాబితాలో లెబనాన్‌ 140 కోట్లు, మయన్మార్‌ 95.40 కోట్లు, సిరియా 47.40 కోట్ల డాలర్లు అందుకున్నాయి

More Telugu News