south korea: ఉత్తరకొరియా ఏ క్షణంలోనైనా మరో అణుపరీక్ష చేయవచ్చు: దక్షిణ కొరియా

వరుసగా అణుపరీక్షలు చేస్తూ ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తోన్న ఉత్త‌ర‌కొరియా మ‌రో అణుప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని ద‌క్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఉత్త‌ర‌కొరియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంద‌ని తెలిపింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్‌లో ఉత్త‌ర‌కొరియా రెండుసార్లు అణుపరీక్ష జరిపిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో అణుప‌రీక్ష‌కు సిద్ధ‌మైన ఆ దేశం ఏ క్షణంలోనైనా దాన్ని నిర్వహించే అవకాశమున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. అందుకు మంచి స‌మ‌యం కోసం ఆ దేశం వేచి చూస్తోంద‌ని చెప్పింది. దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం త‌లెత్తిన నేపథ్యంలో, వచ్చే ఏడాది ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో, దానిని అదనుగా తీసుకుని ఆ సమయంలో అణుపరీక్షకు ఉత్తర కొరియా స‌న్నాహాలు చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు.   

More Telugu News