kejriwal: అఫిడవిట్‌లో తప్పుడు చిరునామా కేసు: కోర్టులో హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి.. బెయిల్‌ మంజూరు

ఢిల్లీలో 2013లో జ‌రిగిన‌ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఎన్నిక‌ల కమిష‌న్‌కు ఇచ్చిన‌ నామినేషన్‌ పత్రాల్లో భాగంగా స‌మ‌ర్పించిన‌ అఫిడవిట్‌లో  తప్పుడు చిరునామా ఇచ్చారని ఆయ‌న‌పై గ‌తంలో కేసు న‌మోద‌యిన విష‌యం తెలిసిందే. ఆ అఫిడ‌విట్‌లో కేజ్రీవాల్ త‌న‌ ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలు చూపించారని ఓ ఎన్జీవో తరఫున ఇద్దరు వ్యక్తులు కోర్టులో ఈ కేసు వేశారు. ఈ కేసుకి సంబంధించి బెయిల్‌ ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయ‌ని, అందుకోసం కేజ్రీవాల్‌ ఒక రోజు కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఈరోజు ఆయన కోర్టుకి హాజరయ్యారు. వాద‌న‌లు విన్న‌ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ ఆశిష్ గుప్తా కేజ్రీవాల్‌కు రూ.10 వేల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

More Telugu News