: ఒప్పందం ఉల్లంఘించాడని... ఒక వ్యక్తిని అమ్మకానికి పెట్టిన ఈ కామర్స్ సంస్థ!

మనుషుల్ని కొనడం లేదా అమ్మడం బానిసత్వానికి నిదర్శనంగా భావిస్తుంటాం. రష్యాలో చోటుచేసుకున్న ఓ చిత్రమైన ఘటన అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే... రష్యాలో  పిచ్ షాప్ అనే గిఫ్ట్ స్టోర్ సంస్థ ఈ కామర్స్ వ్యాపారం చేస్తుంటుంది. ఈ సంస్థ ఇచ్చే ఫ్లోర్ బోర్డులకు అలెగ్జాండర్ కామరెంకో (21) స్క్రీన్ ప్రింట్ చేసి అప్పగించాలి. అయితే కామరెంకో ఆ పని సకాలంలో చేయలేకపోయాడు. దీంతో వ్యాపారంలో నష్టం వచ్చిందని భావించిన పిచ్ షాప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 51 వేల డాలర్లు (35 లక్షల రూపాయలు) జరిమానాగా చెల్లించాలని అతనికి నోటీస్ పంపింది.

అయితే, అతని నుంచి సమాధానం రాకపోవడంతో, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఒనగూరే లాభం ఏమీ ఉండదని గుర్తించిన పిచ్ షాప్ అతనితో మరో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం, తమ సంస్థకు ప్రచారం కోసం అతనిని మహిళలకు అమ్మకానికి పెడుతున్నట్టు తెలిపింది. అతనిని వేలంలో కొనుక్కున్న మహిళకు ఏడాదిపాటు భర్తగా ఉంటాడని తెలిపింది. అతని కొలతలు, అభిరుచులు తన వెబ్ సైట్ లో పెట్టింది. దీంతో అతనిని కొనుగోలు చేసేందుకు మగాళ్లు కూడా ఆసక్తి చూపడంతో 35 ఏళ్ల లోపు మహిళలు మాత్రమే పాల్గొనాలని సదరు సంస్థ పేర్కొంది. దీంతో అతను భర్తగా ఉంటాడా? బానిసగా ఉంటాడా? అదీ ఏడాదిపాటా? ఇందులో అతనికి శిక్షేముంది? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. దీనితో 'పిచ్ షాప్'కు ప్రచారం మాత్రం భారీగా సాగుతోంది. 

More Telugu News