: పొగమంచు గుప్పిట్లో ఢిల్లీ... 52 రైళ్లు ఆలస్యం... రాకపోకలకు అంతరాయం

పడిపోయిన ఉష్ణోగ్రతలతో దేశ రాజధాని ఢిల్లీ పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో శనివారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సిన 52 రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఐదు రైళ్ల షెడ్యూల్ ను మార్పు చేశారు. ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలకు తగ్గిపోయాయి. ఈ పరిస్థితులతో విమానాశ్రయంలో విమాన రాకపోకల్లోనూ ఆలస్యం నెలకొంది. మరోవైపు ఉత్తరభారతంలో అయితే మరింత తీవ్ర పరిస్థితులే నెలకొన్నాయి. కశ్మీర్ వ్యాలీ అంతటా మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు క్షీణించాయి. 

More Telugu News