demonitisation: పెద్దనోట్ల రద్దుపై కీలక సమావేశం నిర్వహించనున్న ప్రధాని మోదీ

దేశంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఏర్ప‌డిన‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ నెల 27న‌ నీతి ఆయోగ్‌ సభ్యులు, ఆర్థికవేత్తలు, ఆర్థిక, పరిశ్రమలు తదితర శాఖల ఉన్నతాధికారులతో క‌లిసి ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. దేశంలో నగదు కొరత స‌మ‌స్య ఏర్ప‌డడంతో అసంఘటిత రంగంలోనివారు ఉపాధి కోల్పోతుండడంతో పాటు తదితర సమస్యల పరిష్కార మార్గాల‌పై, న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను పెంచడంపై వారు చ‌ర్చించ‌నున్నారు. పెద్ద‌నోట్ల రద్దుతో ఆర్థిక రంగం కుదేల‌వుతుంద‌ని ఇటీవ‌లే రిజర్వు బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఈ స‌మీక్ష ఏర్పాటు చేయ‌నుండ‌డంతో దీనికి మ‌రింత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

More Telugu News