: అందం మీద పెద్ద అభిప్రాయం లేదు: హృతిక్ రోషన్

తనకు అందం మీద గొప్ప అభిప్రాయం లేదని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తెలిపాడు. 'కాబిల్' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, ప్రపంచ అందగాళ్లలో తాను కూడా ఒకరు అంటూ పేర్కొనడం ప్రశంసగా భావిస్తానని, అంతకుమించి దానికి ఎలాంటి ప్రత్యేకత ఉండదని అన్నాడు. దాని కోసం ప్రత్యేక అర్హతలు ఉండవని తెలిపాడు. ఎవరి మనసులోనో ఏదో అనిపిస్తే...వాటిని లెక్కేసుకుని ఆ వ్యక్తి అందగాళ్లు అని చెబితే దానిని అదనపు అర్హతగా భావించిడం అంత అవివేకం ఇంకోటి ఉండదని హృతిక్ రోషన్ చెప్పాడు. అందుకే అది ప్రశంస మాత్రమె అని చెప్పాడు.

'కాబిల్'తో తనలోని నటుడు సంతృప్తి చెందాడని హృతిక్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఈ పాత్ర చేస్తే బాగుండేదని ప్రతి నటుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు భావిస్తాడని, అలాంటి తన కోరికలన్నీ నెరవేరిపోయాయని హృతిక్ తెలిపాడు. యామీ గౌతమ్ కేవలం అందగత్తె మాత్రమే కాదని, స్వతహాగా నటి అని దర్శకుడు సంజయ్ గుప్తా తెలిపాడు. ఆమెతో నటించడం అద్భుతంగా ఉందని హృతిక్ రోషన్ అన్నాడు. ఈ సినిమా కొత్త అనుభూతులు నింపిందని హృతిక్ రోషన్ చెప్పాడు. 

More Telugu News