berlin truck attack case: బెర్లిన్‌ నగరంలో ట్రక్కుతో దాడి చేసిన ఉగ్రవాదిని ఎట్టకేలకు మట్టుబెట్టిన పోలీసులు

జర్మనీ రాజధాని బెర్లిన్‌ నగరంలో జ‌నంతో కిక్కిరిసి పోయిన క్రిస్మ‌స్ మార్కెట్‌లో ట్రక్కుతో దూసుకువ‌చ్చి 12 మంది ప్రాణాలు తీసిన ఉగ్ర‌వాదిని పోలీసులు ఎట్ట‌కేల‌కు మ‌ట్టుబెట్టారు. ఈ రోజు ఇటలీలో ఉత్తరాదిన ఉన్న మిలాన్‌ నగరంలో కాల్పులు జ‌రిపి ఆ ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చిన‌ట్లు, అత‌డు ట్యునీసియాకు చెందిన 24 ఏళ్ల అనిస్‌ అమ్రిగా తాము భావిస్తున్న‌ట్లు అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జ‌రుగుతుండ‌గా తీసిన‌ ఓ వీడియోను ఇటలీ మేగజైన్‌ పనోరమ వెబ్‌సైట్‌లో ఉంచారు.

బెర్లిన్ న‌గ‌రంలో ట్ర‌క్కుతో దాడి చేసింది తామేన‌ని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ దాడి అనంత‌రం ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ దాడి చేసింది పాకిస్థానీ అని భావించిన పోలీసులు మొదట ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి, విచారణ అనంత‌రం వ‌దిలేశారు.

More Telugu News