: ఇతడు ప్రపంచంలోనే అతి భారీ కాయుడు.. సగం బ‌రువు త‌గ్గుతానంటున్నాడు!

మెక్సికోకు చెందిన జువాన్ పెడ్రో బ‌రువు 590 కేజీలు. ప్రపంచంలోనే అతి భారీ కాయుడిగా అత‌డు అంద‌రికీ సుప‌రిచితుడే. ఇప్పుడు బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. అతి బరువుతో హై బీపీ, ఊపిరితిత్తుల వ్యాధుల‌ను కొనితెచ్చుకున్న జువాన్ పెడ్రో ఇటీవ‌లే తీవ్ర అనారోగ్యం పాల‌య్యాడు. అతి బరువే త‌న అనారోగ్యానికి కార‌ణ‌మ‌ని వైద్యులు చెప్పడంతో ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని నిర్ణ‌యించుకున్నాడు. తాను ఇప్పుడున్న బ‌రువులో సగం వరకు తగ్గుతానని చెబుతున్నాడు.

అందుకోసం వైద్యుడు జోస్ కాస్టనెడా క్రూజ్ ను సంప్ర‌దించాడు. జువాన్ పెడ్రోకు ఇస్తోన్న చికిత్స గురించి స‌ద‌రు డాక్ట‌ర్ మీడియాకు వివ‌రాలు తెలిపారు. తొలుత‌ రెండు విధానాల్లో అత‌డికి చికిత్స చేస్తామని, దాంతో జువాన్ పెడ్రో 60 కేజీల వరకు తగ్గుతాడ‌ని చెప్పారు. తాము తొలుత అత‌డి శరీరం నుంచి సాధ్యమైనంత వరకు బరువు తగ్గిస్తామని, త‌రువాత‌ ప్రత్యేక చికిత్స ద్వారా అతని బాడీని కంట్రోల్ లోకి తెస్తామని పేర్కొన్నారు. తాము అత‌డికి చికిత్స అందించిన‌ ఆరు నెలల్లో బరువు తగ్గుతాడ‌ని, ఆరోగ్యవంతుడిగా ఉంటాడని ఆయన చెప్పారు.

More Telugu News