: ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్... ఆ బిల్లు ఆమోదం పొందితే, ఇకపై మీరు బెంగళూరులో జాబ్ చేయలేకపోవచ్చు!

మన దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు వర్ధిల్లుతున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది  ఐటీ నిపుణులు బెంగళూరులో పని చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఐటీ కంపెనీలు, మంచి వాతావరణం ప్రతి ఒక్కరినీ బెంగళూరుకు రప్పిస్తున్నాయి. ఒక్క ఐటీనే కాదు... చిన్నాచితకా ఉద్యోగాలకు కూడా బెంగళూరు కేరాఫ్ అడ్రస్సే. చదువురాని వారికి కూడా బెంగళూరులో ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది. ఈ క్రమంలో ఒక వార్త అందరినీ కలచివేసేదే.

మరో ఏడాదిన్నరలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో, మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా స్థానికతకు పెద్దపీట వేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక పారిశ్రామిక ఉద్యోగ నిబంధనలు 1961కి సిద్ధరామయ్య ప్రభుత్వం సవరణలు చేయబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే... ఉద్యోగాలన్నీ స్థానికులకే వెళతాయి. కన్నడేతరులకు అతి తక్కువ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలవుతాయి. బిల్లు ప్రకారం కర్ణాటకలో ఉద్యోగం చేయాలంటే... కన్నడిగుడు అయిఉండాలి. కన్నడ చదవడం, రాయడం కూడా వచ్చి ఉండాలి. 15 ఏళ్లు కర్ణాటకలో నివసించి ఉండాలి. ఈ బిల్లు ఆమోదం పొందితే... ఐటీ, తయారీ, బయోటెక్ తదితర రంగాలన్నీ ప్రభావితమవుతాయి. ఇదే జరిగితే బెంగళూరులో ఉన్న కన్నడేతర ఐటీ నిపుణులంతా సూట్ కేస్ సర్దుకోవాల్సిందే.

More Telugu News