: 2016లో టాప్ యాండ్రాయిడ్ యాప్స్ ఇవే: జాబితా విడుదల చేసిన గూగుల్

ఈ సంవత్సరంలో నెటిజన్లు అమితంగా ఆదరించిన యాప్స్ వివరాలను గూగుల్ విడుదల చేసింది. గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం, టాప్ ట్రెండింగ్ యాప్స్ లో బ్యూటీ ప్లస్ మీ, వోట్ టీవీ షోస్ మూవీస్ కార్టూన్స్, గూగుల్ డుయో, మిస్టర్ వూనిక్, టాప్ ఎమోజీ కీబోర్డ్ యాప్స్ ఉన్నాయని పేర్కొంది. టాప్ గేమింగ్ యాప్స్ లో ట్రెయిన్ సిములేటర్ 2016, సుల్తాన్: ది గేమ్, ట్రాఫిక్ రైడర్, టాప్ మేడిన్ ఇండియా యాప్స్ లో ఇండియన్ రైల్ ట్రైన్ పీఎన్ఆర్ స్టాటస్ (ఇక్సిగో డాట్ కామ్), రెసిపీ బుక్, హెల్తిఫై మీ (వెయిట్ లాస్ కోచ్), మైంత్రా ఆన్ లైన్ షాపింగ్, హలో ఇంగ్లీష్, మోస్ట్ షేర్డ్ యాప్స్ లో బ్లూమ్ బర్గ్ ఫ్రమ్ ఇన్ స్టాగ్రామ్, బ్యూటీ ప్లస్ మీ, గావో బాలీవుడ్, గూగుల్ అల్లో, డబ్ స్మాష్ లు ఉన్నాయని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ యాప్స్ లో ఫేస్ చేంచర్, లూమియర్ - ఫోటో అండ్ సెల్ఫీ ఎడిటర్, క్యాస్ట్ బాక్స్ - పోడ్ కాస్ట్ రేడియో మ్యూజిక్, టాప్ గ్లోబల్ గేమింగ్ యాప్స్ లో పోకేమాన్ గో, క్లాష్ రోయల్, ట్రాఫిక్ రైడర్ ఉన్నాయని పేర్కొంది. అత్యధికులు విన్న సాంగ్స్ లో జస్టిన్ బీబర్ 'సారీ', ట్వంటీ వన్ పైలట్స్ 'స్ట్రెస్డ్ అవుట్', విజ్ కిడ్ అండ్ కైలా 'వన్ డ్యాన్స్' ఉన్నాయని, టాప్ మూవీస్ లో డెడ్ పూల్, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్, జటోపియాలకు స్థానం లభించిందని గూగుల్ పేర్కొంది.

More Telugu News