naini narsimha reddy: ఉగ్రవాదుల దాడిలో హోంగార్డు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం ఇస్తున్నాం: శాసనసభలో నాయిని

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. శాస‌న‌స‌భ‌లో రాష్ట్రంలోని హోంగార్డుల స‌మ‌స్య‌ల‌పై ఈ రోజు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు తెలంగాణ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి స‌మాధానం చెప్పారు. హోంగార్డుల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. వారి జీతభత్యాలను ఎప్పటికప్పుడు పెంచుతున్నామని చెప్పారు. వారికి జీవిత బీమా ప్రీమియంతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, విధుల్లో ఉండ‌గా హోంగార్డు మరణిస్తే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. హోంగార్డు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని తెలిపారు. హోంగార్డులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న వారికి పోలీసుల నియామకాల్లో ప్ర‌త్యేకంగా రిజర్వేషన్లు కూడా ఇస్తున్న‌ట్లు తెలిపారు.

More Telugu News