: దారితప్పిన చిన్న పిల్లాడిలా ప్రవర్తించవద్దు: ఇండియాకు చైనా హెచ్చరిక

"కొన్నిసార్లు ఇండియా దారితప్పిన చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కిరీటం పెట్టుకొని, ఓ గొప్ప దేశంగా ఎదిగే సత్తా ఉన్నప్పటికీ, సరైన దీర్ఘదృష్టి లేదు. 'వన్-చైనా' పాలసీని సవాల్ చేసిన అమెరికా కాబోయే అధ్యక్షుడిని మేమెలా దారిలో పెట్టామో చూసి పాఠాలు నేర్చుకోండి. మాపై దలైలామా కార్డును ప్రయోగిస్తే, ఏ మాత్రం ప్రయోజనం లేదు" అని చైనా భారత్ ను హెచ్చరించింది.

 తైవాన్ వ్యవహారంలో బీజింగ్ కు, ట్రంప్ కు మధ్య ఎలాంటి వ్యవహారాలు నడిచాయో, ట్రంప్ ఎలా వెనుకంజ వేశాడో తెలుసుకోవాలని ప్రభుత్వ అధీనంలోని 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే దిశగా, ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే, ఇండియానే నష్టపోతుందని హితవు పలికింది.

కాగా, తైవాన్ ప్రెసిడెంట్ తో ట్రంప్ మాట్లాడటాన్ని చైనా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఇక మంగోలియా భారత్ కు దగ్గరవుతుండటాన్నీ చైనా సహించలేకపోతోంది. తమ దేశంలో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు ఇండియా సహకరించాలని మంగోలియా రాయబారి కోరడం, అందుకు భారత్ సానుకూలంగా స్పందించడాన్ని చైనా సహించలేకనే ఇలా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News