: మోదీ, అగ్నిపరీక్షకు సిద్ధంకండి!: మమత, ఏచూరి, లాలూ

భారత ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేతలు సమరశంఖం పూరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా సంస్థ నుంచి మోదీ ముడుపులు స్వీకరించారంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోదీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని... దీంతో, ముడుపుల అంశంపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, రాహుల్ ఆరోపణలపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. 'మోదీ హఠావో... దేశ్ బచావో' నినాదంతో జనవరి 1 నుంచి 8 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అగ్నిపరీక్షకు మోదీ సిద్ధం కావాలని అన్నారు.

More Telugu News