tiger: యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వచ్చిన నల్ల చిరుత పిల్ల

యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ క్యాంపస్‌లోకి ఓ న‌ల్ల‌ చిరుత పిల్ల (పాంథర్ కబ్) వ‌చ్చింది. దానిని గ‌మ‌నించిన వ‌ర్సిటీ విద్యార్థులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అక్క‌డ‌కు చేరుకున్న సిబ్బంది దానిని ప‌ట్టుకొని అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. స‌ద‌రు చిరుత పిల్ల ద‌గ్గ‌ర‌లోని ఝాలనా అట‌వీ ప్రాంతం నుంచి వ‌ర్సిటీలోకి వ‌చ్చింద‌ని అటవీశాఖ అధికారులు తెలిపారు. వ‌ర్సిటీలోకి వ‌చ్చిన ఈ అరుదైన చిరుత పిల్ల‌ను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో చేరుకోవ‌డంతో అది భయపడిపోయింద‌ని, నెమ్మదిగా చిరుతను పట్టుకుని దానికి ఆహారాన్ని అందించి తీసుకెళ్లామ‌ని చెప్పారు.

More Telugu News