: 9 నెలల్లో 83 వేల యూనిట్ల అమ్మకాలు... 'కార్ ఆఫ్ ది 2016' మారుతి 'విటారా బ్రెజా'

ఈ సంవత్సరం మార్చిలో భారత మార్కెట్లోకి విడుదలై, 9 నెలల కాలంలో 83 వేల యూనిట్ల అమ్మకాలు సాధించి టాప్-10 సెల్లింగ్ మోడల్స్ లో ఒకటిగా నిలిచిన మారుతి సుజుకి విటారా బ్రెజా ఈ సంవత్సరపు ఉత్తమ కార్ మోడల్ గా నిలిచి "ఇండియన్ కార్ ఆఫ్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది. విటారా బ్రెజా మోడల్ తమకు ఎంతో గర్వకారణమని, ఇండియాలో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరింతగా పెంచిందని ఈ సందర్భంగా సంస్థ బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాహన రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల్లో పనిచేస్తున్న 15 మంది ఆటో జర్నలిస్టుల కమిటీ అవార్డును ఎంపిక చేయగా, హ్యుందాయ్ టస్కాన్, టయోటా ఇన్నోవా క్రిస్టాల నుంచి విటారా బ్రెజాకు గట్టి పోటీ వచ్చింది.

More Telugu News