: హర్బజన్ కొత్త ఇన్నింగ్స్... కాంగ్రెస్ లో చేరి జలంధర్ అసెంబ్లీ బరిలోకి!

వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. క్రికెట్ లో అభిమానులు ముద్దుగా 'టర్బనేటర్' అని పిలుచుకునే హర్భజన్, కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన, జలంధర్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ తో చేతులు కలిపి అమృతసర్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధూ ప్రోత్సాహంతోనే హర్భజన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News