firing: హ‌జిన్ గ్రామంలో చొర‌బ‌డ్డ ఉగ్ర‌వాదులు.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు

జ‌మ్ముక‌శ్మీర్‌ బందిపొరాలోని హ‌జిన్ గ్రామంలో ఉగ్ర‌వాదుల అల‌జ‌డి చెల‌రేగింది. ఆ గ్రామంలోకి ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డారని స‌మాచారం తెలుసుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈ రోజు ఉద‌యం ఆ గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేప‌ట్టారు. అయితే, భ‌ద్ర‌తా బ‌ల‌గాలను గ‌మ‌నించిన ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా వారిపై కాల్పులు జ‌రిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు దీటుగా బ‌దులిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి.

More Telugu News