: డిజిటల్ లావాదేవీ... పెన్ను కొని రూ. 100 చెల్లిస్తే మొబైల్ కు మెసేజ్ రాలేదు, సార్!: కలెక్టర్ల సదస్సులో మహిళా అధికారి

కలెక్టర్ల సమావేశం రెండవ రోజున డిజిటల్ లావాదేవీలపై చంద్రబాబు కలెక్టర్లను, అధికారులను వారు జరిపిన లావాదేవీలపై అడిగి తెలుసుకుంటున్న వేళ, ఓ మహిళా అధికారి పెన్ను కొనేందుకు వెళ్లిన వేళ తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పారు. "సార్... నిన్న ఒక స్టేషనరీ షాప్ లో ఒక పెన్ పర్చేజ్ చేశాను సార్. అయితే, ఆధార్ నంబర్ ఇచ్చాను. ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. నేను మామూలుగా కార్డు యూజ్ చేసి చెల్లింపులు చేస్తే, వెంటనే మొబైల్ అలర్ట్ వస్తుంది బ్యాంక్ నుంచి. కానీ దీంట్లో మొబైల్ అలర్ట్ రాలేదు. డబ్బులు డిడక్ట్ అయ్యాయి. వాళ్ల ఎకౌంట్ కు మెసేజ్ వెళ్లింది. నాకు ఇంతవరకూ కూడా మెసేజ్ రాలేదు" అని వివరించారు. అది బ్యాంకు సర్వర్ సమస్యా? లేదా షాపులో ఏర్పాటు చేసుకున్న పరికరం సమస్యా? అన్న విషయం తనకు తెలియలేదని చెప్పారు. ఆ సమయంలో ఓ సాంకేతికాధికారి కల్పించుకుని, ఎస్ఎంఎస్ ల విషయంలో కొంత సమస్య ఉందని, ఆధార్, టెలికం సర్వీస్ ప్రొవైడింగ్ సర్వర్ల మధ్య సమాచార బట్వాడా విషయంలో సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

More Telugu News