: అసలు ఒక సినిమా తీయాల్సిన అవసరం ఏంటి?: రాంగోపాల్ వర్మ

'వంగవీటి' సినిమా తీయాల్సిన అవసరం ఏంటన్న టీవీ యాంకర్ ప్రశ్నకు... అసలు ఏ సినిమా అయినా తీయాల్సిన అవసరం ఏమిటి? అని ఎదురు ప్రశ్నించి రాంగోపాల్ వర్మ షాకిచ్చాడు. 'వంగవీటి' ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా సంఘటన లేదా పరిస్థితి నుంచి స్పూర్తి పొంది, దానిని కథగా ఊహించుకుని, దానిలో మమేకమైతే సినిమాగా రూపొందుతుందని వర్మ చెప్పారు. ఈ సినిమాలో తాను ఎవరినీ ఎక్కువ, తక్కువలుగా చూపించలేదని ఆయన అన్నారు.

ఒకవేళ తాను ఎవరినైనా ఎక్కువ లేదా తక్కువగా చూపిస్తే.... ఆ ఘటనలతో సంబంధమున్నవారు తనపై కసితీర్చుకుంటారని, అంతేకానీ, వారి అభిమానులమంటూ, ఈ సినిమా వల్ల సమాజంలో ఏదైనా జరుగుతుందని హెచ్చరించడమేంటని ఆయన ప్రశ్నించారు. అసలు ఏదైనా చేయాలని వారు ముందుగానే నిర్ణయించుకున్నారా? అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అప్పటి ఘటనలతో సంబంధం ఉన్నవారు, తాను చెప్పింది అబద్ధమని నిరూపించగలిగిన వారు తనను ప్రశ్పిస్తే సమాధానం చెప్పేందుకు తానెప్పుడూ సిద్ధమని ఆయన తెలిపారు. 

More Telugu News