: వెంకటరత్నంను 72 సార్లు పొడిచారని పోలీసు రికార్డుల్లో ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను!: రాంగోపాల్ వర్మ

ఏదైనా ఒక సంఘటన వెనుక అసలు వాస్తవాలు ఎవరికీ తెలియవని రాంగోపాల్ వర్మ అన్నారు. 'వంగవీటి' ప్రమోషన్ లో మాట్లాడుతూ, మనం దేనిని నమ్ముతామో అదే నిజమని అనుకుంటామని, అసలు నిజం అనేది ఎవరికీ తెలియదని, ఎవరి కోణంలో వారిదే నిజమని ఆయన చెప్పారు. 'వంగవీటి' కథను 5 భాగాలుగా తీసినా పూర్తి కాదని ఆయన చెప్పారు. సన్నివేశం కంటే అందులోని ఎమోషన్ ను పండించడమే ముఖ్యమని ఆయన అన్నారు.

'వంగవీటి' సినిమాలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించే ప్రయత్నం చేశానని చెప్పారు. వెంకటరత్నంను 72 సార్లు పొడిచారని పోలీసు రికార్డుల్లో ఉందని తెలిసి ఆశ్చర్యపోయానని, ఒక మనిషిని 72 సార్లు పొడిస్తే కానీ చావరా? అనిపించిందని, అయితే ఒక వ్యక్తిని కలిసి దీనిపై రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక డీటెయిల్ తెలిసిందని ఆయన అన్నారు. అతనిని చంపాలన్న తొందరతో పాటు, ఈ అవకాశం పోతే మళ్లీ రాదన్న ఆలోచన కూడా ఆయనను రౌండ్ చేసిన 12 మందిలో ఉందని, దీంతో ఆయనను 72 సార్లు పొడిచి చంపారని తెలియడంతో నిజమే అనిపించిందని ఆయన తెలిపారు. 

More Telugu News