: కరీనా పసిబిడ్దతో ఉన్న ఫొటోలు నిజమైనవి కావట!

బాలీవుడ్ దంపతులు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ కు మగ బిడ్డ పుట్టిన విషయం విదితమే. ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో ఈ రోజు కరీనా మగబిడ్డకు జన్మనిచ్చింది. కరీనా తన బిడ్డతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు నిజమేనని, నెటిజన్లు భావిస్తున్న సమయంలో కరీనకపూర్ అధికార ప్రతినిధి ఒక వాస్తవం బయటపెట్టారు. ఆ ఫొటోలు నిజమైనవి కాదని, ఫొటో షాప్ మాయాజాలమని  ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కాగా, ఈ చిన్నారికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అనే పేరుపెట్టారు. ‘తైమూర్’ అనే పేరుపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.

More Telugu News