ashwin: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో 'నెంబర్ వన్.. టూ' స్థానాల్లో నిలిచిన టీమిండియా బౌలర్లు అశ్విన్, జడేజా

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా ఆట‌గాళ్లు అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌ర్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో వారు ఎగ‌బాకారు. తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన‌ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో నిలిచాడు. ఇక‌ ర‌వీంద్ర జ‌డేజా నాలుగు ర్యాంకులు ఎగ‌బాకి రెండోస్థానంలో ఉన్నాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు క‌లిసి ఓ రికార్డు కూడా సృష్టించారు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమిండియా బౌల‌ర్లుగా నిలిచారు. 1974లో ఈ రికార్డు భార‌త స్పిన్ ద్వ‌యం బిష‌న్‌సింగ్ బేడీ, భ‌గ‌వ‌త్ చంద్ర‌శేఖ‌ర్ లు నెల‌కొల్పారు.

చివ‌రి టెస్టులో ప‌ది వికెట్ల తీసిన జ‌డేజా ఖాతాలో 66 పాయింట్లు చేర‌డంతో ఆయ‌న నెంబ‌ర్ 2 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. జ‌డేజాకి అశ్విన్ కంటే 8 పాయింట్లు త‌క్కువ‌గా ఉన్నాయి. ఇక టెస్టుల్లో ఆల్ రౌండర్ల ర్యాంకుల్లోనూ  అశ్విన్ మొద‌టి స్థానంలో ఉన్నాడు.  ఈ లిస్టులో జ‌డేజా మూడో ర్యాంకు సంపాదించుకున్నాడు త‌న కెరీర్‌లోనే జ‌డేజాకు ఇది బెస్టు ర్యాంకు.



More Telugu News