: రామూ! ప్లీజ్ అలా ఒట్లు వేయవద్దు... డోంట్ చేంజ్ యువర్ లైఫ్: జోకులేస్తూ నవ్వించిన నాగార్జున

"రామూ నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. నువ్వింత సెంటిమెంట్ ఎలా అవుతున్నావు? ఒట్లేసి, అదేసి... ఎవరైనా 'నా ఇష్టం' అని బుక్ రాసి నాకే అంకితం చేసుకుంటున్నాను అంటారా? చేసుకుంటారా? ఎనీబడీ?... ఐ థింక్ దిసీజ్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. నాకు ఎప్పుడైనా బోర్ కొడితే... బోర్ కూడా కాదు. ఎప్పుడైనా డిప్రెస్ అయితే, రాము ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేస్తాను. అండ్ దట్ ట్విట్టర్ ఎకౌంట్ ఈజ్ ఫెంటాస్టిక్.... ఏమనుకున్నాడో మైండ్ లో అదే చెబుతాడు. అండ్... రామూ... లివ్ యువర్ లైఫ్ ఎగ్జాక్ట్ లీ ద వే యూ లైక్. డోంట్ చేంజ్ యువర్ లైఫ్. ప్లీజ్.. ఆ ఒట్లు వేయద్దు రామూ... ప్లీజ్ ఒట్టేయద్దు. ఎందుకంటే, ఇటువంటివి మళ్లీ చేయను అని చెప్పి ప్లీజ్.." అన్నాడు. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నాగార్జున చేసిన ప్రసంగం ఆద్యంతం జోకులతో సాగగా, అక్కడున్న సినీ ప్రముఖులు నవ్వుల్లో మునిగిపోయారు.

More Telugu News