: నేను ఏం సాధించానంటే, అమితాబ్ ను హైదరాబాదు తీసుకురాగలిగానంటాను: రాంగోపాల్ వర్మ

విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాసులు ఎగ్గొట్టి, సినిమా థియేటర్లలో గడపడంతో రెండు సార్లు ఇంజనీరింగ్ పరీక్ష తప్పానని వర్మ తన గురించి వేసిన టీజర్ లో తెలిపాడు. పిచ్చిపిచ్చిగా రోడ్లపై రాడ్లు పట్టుకుని తిరిగే గ్యాంగుల్లో ఉంటూ వారిని గమనిస్తూ జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. కొన్నేళ్ల తరువాత ఆనాటి తన అనుభవాలకు కథ జోడించి నాగార్జున్ ఇచ్చిన బ్రేక్ తో 'శివ' సినిమా తీశానని అన్నాడు.

ఆ సినిమా రిలీజైన తరువాత 'తీస్తే ఇలాంటి సినిమాయే తీయాలనుకునే' దర్శకులు, 'చేస్తే ఇలాంటి క్యారెక్టరే చేయాలనుకునే హీరోలు', 'రాస్తే ఇలాంటి కథే రాయాలనుకునే రచయితలు', 'చూస్తే ఇలాంటి సినిమానే చూడాలనుకునే ప్రేక్షకుల'ను సంపాదించుకుని, 'క్షణక్షణం', 'అంతం', 'దెయ్యం', 'అనగనగా ఒకరోజు', 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'భూత్', 'సర్కార్' వరకు చేరుకున్నానని అన్నాడు.

విజయవాడలో కాలేజీ ఎగ్గొట్టి 'జంజీర్' సినిమా చూసి స్పూర్తి పొందిన తాను, ఆ సినిమా హీరో అమితాబ్ ను చేరుకుని, ఆయననే ముఖ్యఅతిథిగా ఈ ఫంక్షన్ కు ముంబై నుంచి హైదరాబాదుకు రప్పించడం గర్వంగా ఉందని రాంగోపాల్ వర్మ తెలిపాడు. తనకే బ్రేక్ ఇచ్చిన నాగార్జునకు, తనలో స్పూర్తిని రగిలించిన అమితాబ్ కు ధన్యవాదాలు తెలిపాడు. 

More Telugu News