: సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులే ఆమెను పట్టించాయి!

రష్యాకు చెందిన ఇరవై రెండేళ్ల అనాస్టిషియా సిరెన్ష్వికొవా మాస్కోలో డిగ్రీ చదువుతోంది. సోషల్ మీడియా ద్వారా తన ఫొటోలు తరచుగా పోస్ట్ చేస్తుంటుంది. అయితే, కొంతకాలంగా ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఖరీదైన హోటళ్లలో తింటూ, ఖరీదైన దుస్తులు ధరించి, కార్లను నడుపుతూ దిగిన ఈ ఫొటోలపై పోలీసుల కన్ను పడింది. ఒక సాధారణ విద్యార్థి ఇంత విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నదనే అనుమానం వారికి వచ్చింది.

అంతే, రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు బాగోతం బయటపడింది. క్రెడిట్- మాస్కో బ్యాంక్ కు చెందిన మాజీ ఉద్యోగి మికైల్ గోమా నేతృత్వంలో దళారి గ్యాంగ్ ఒకటి ఉంది. వ్యాపారస్థుల నల్ల ధనాన్ని విదేశాలకు ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది. మార్పిడి చేయాల్సిన డబ్బు మొత్తంలో 2.5 శాతం కమీషన్ కింద ఈ గ్యాంగ్ తీసుకుంటుంది. ఈ గ్యాంగ్ లో సభ్యురాలిగా అనాస్టిషియా చేరింది. దీంతో, విలాసవంతమైన జీవితం గడుపుతోందనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కాగా, రష్యాలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్ పై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

More Telugu News