: అమెరికా డ్రోన్ ను తిరిగి అప్పగించిన చైనా!

దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికాకు చెందిన అండర్ వాటర్ డ్రోన్ ను చైనా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఆగడాలకు ముగింపు పలుకుతామంటూ చైనా హెచ్చరించింది. డ్రోన్ ను తిరిగి అప్పగించకుంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనాకు అమెరికా అధ్యక్షుడు ఒబామా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో, డ్రోన్ ను అమెరికాకు అప్పగించింది చైనా. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగిన తర్వాత డ్రోన్ ను అప్పగించేందుకు చైనా అంగీకరించినట్టు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. అయితే, డ్రోన్ ను సీజ్ చేసిన ఘటనపై విచారణ జరపనున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. మరోవైపు, 'మీరు దొంగిలించిన మా డ్రోన్ ను మీ వద్దే ఉంచుకోండంటూ' చైనాపై సెటైర్ విసిరారు కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో డ్రోన్ ను చైనా అప్పగించింది. 

More Telugu News