: రూ. 5 వేల డిపాజిట్ రూల్ పై ఇంకాస్త స్పష్టత ఇచ్చిన జైట్లీ

రద్దయిన నోట్ల డిపాజిట్ గడువు మరో 9 బ్యాంకు సెషన్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో డిపాజిట్ల పరిమితిని కేవలం రూ. 5 వేలకు సవరించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ, విమర్శలు పెరగడంతో కొంత వివరణ ఇచ్చింది. డిసెంబర్ 30లోపు రూ. 5 వేలకు మించిన పాత నోట్లను ఒక్కసారి మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, అది కూడా ఇద్దరు బ్యాంకు అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెబితేనేనని సోమవారం నాడు స్పష్టం చేసిన ఆర్థిక శాఖ, ఆపై కాస్తంత వెనక్కు తగ్గింది.

రూ. 5 వేలకు మించిన కరెన్సీని ఒకసారి డిపాజిట్ చేసుకుంటే ఎవరూ ఎలాంటి ప్రశ్నలూ అడగబోరని, అదే వ్యక్తి రెండోసారి వస్తే మాత్రం ప్రశ్నిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కాగా, నోట్ల రద్దుకు ముందు వ్యవస్థలో 15.4 లక్షల కోట్ల రూపాయల విలువైన 500, 1000 నోట్లు ఉండగా, వాటిల్లో రూ. 13 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చేశాయి. నోట్ల రద్దు తరువాత సాధారణ ప్రజలకు అన్ని ఇచ్చామని, చివరి క్షణాల్లో అక్రమార్కులకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

More Telugu News