: మార్చుకోలేక.. ఉంచుకోలేక.. బస్తా డబ్బులు చింపి పడేశారు!

పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు ముగింపు దశకు చేరుకుంది. ఇదే సమయంలో, రూ. 5000లకు మించితే కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలంటూ నిన్న ఆర్బీఐ కొత్త నిబంధనను విధించింది. దానికి కూడా బ్యాంకు సిబ్బంది అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో, పెద్ద నోట్లను ఇకపై డిపాజిట్ చేయడం కూడా కష్టమే. ఐటీ, ఈడీ దాడులతో బయట కూడా నోట్లను మార్చుకోవడం కొంత కష్టతరంగానే మారింది. దీంతో, చాలామందికి తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఏం చేసుకోవాలో దిక్కుతోచని స్థితి నెలకొంది.

నల్లధనం కలిగిన వారు చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బును ముక్కలుముక్కలుగా చేసి డ్రైనేజీల్లోను, చెత్తకుప్పల్లోను వేస్తున్నారు. తాజాగా ముంబైలోని చార్కప్ ప్రాంతంలోని డ్రైనేజీ పక్కన ఒక బస్తాడు డబ్బులు దొరికాయి. ఇవన్నీ ముక్కలుముక్కలుగా చింపేసి ఉన్నాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ, డబ్బును కటింగ్ మెషీన్ తో ముక్కలు చేశారని తెలిపారు. డబ్బును పడేసిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు.



More Telugu News