: టర్కీలో రష్యా రాయబారి కాల్చివేత.. ప్రసంగిస్తుండగా తుపాకితో గుళ్ల వర్షం కురిపించిన సాయుధుడు

టర్కీలో రష్యా రాయబారి కాల్చివేతకు గురయ్యారు. విదేశీ దౌత్యవేత్తలు నివసించే కాంకయ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో రాయబారి ఆండ్రీ కార్లోవ్‌ ప్రసంగిస్తుండగా హాల్లోకి చొరబడిన సాయుధ దుండగుడు ఆయనపై తూటాల వర్షం కురిపించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కార్లోవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిరియా నుంచి ఉగ్రవాదుల తరిమివేతలో బషర్ అల్-అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు పలుకుతుండడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. అలెప్పో నుంచి ఐసిస్‌ను తరిమివేసి తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం పైచేయి సాధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు అలెప్పో, ప్రతీకారం అని నినాదాలు చేయడం ఇందుకు ఉదాహరణ అని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News