: 'ముర్దాబాద్' అనే నినాదం మనది కాదు.. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలది: కార్యకర్తలకు రాహుల్ గాంధీ హితబోధ

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ ' మోదీ ముర్దాబాద్' అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలను అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ర్యాలీ నిర్వహించిన రాహుల్ గాంధీని మెప్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు 'మోదీ ముర్దాబాద్, ప్రైమ్ మినిస్టర్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే కల్పించుకున్న రాహుల్ గాంధీ కార్యకర్తలను నిలువరించారు.

'మోదీ ముర్దాబాద్' అని అనవద్దని హితవు పలికారు. మోదీ ముర్దాబాద్ (నాశనం కావాలి) అనకూడదని, ఆయన మనకు ప్రధాని అని స్పష్టం చేశారు. మోదీ మనకు కేవలం రాజకీయ శత్రువు మాత్రమేనని చెప్పారు. ఆయనపై రాజకీయ పోరాటం చేసి ఓడించాలి కానీ, ఆయన నాశనమవ్వాలని కోరుకోకూడదని హితవు పలికారు. అతి వాదులు, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు మాత్రమే అలాంటి పదాలు వాడుతాయని ఆయన స్పష్టం చేశారు. మోదీని రాజకీయంగానే ఓడిద్దామని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News