: 250 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పిన కరుణ్ నాయర్

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కరుణ్ నాయర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేఎల్ రాహుల్ (199), కరుణ్ నాయర్ (284) ధాటిగా ఆడగా, వారికి పార్థివ్ పటేల్ (71), రవిచంద్రన్ అశ్విన్ (67) అండగా నిలవడంతో 700 పైచిలుకు పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో కెరీర్ లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. గతంలో ఈ ఫీట్ ను దిలీప్ సర్దేశాయ్, వినోద్ కాంబ్లీ చేశారు. 

More Telugu News