: కరణ్ నాయర్ డబుల్ సెంచరీ...టీమిండియా 600/5

అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా బ్యాట్స్ మన్ కరణ్ నాయర్ సద్వినియోగం చేసుకున్నాడు. నేటి ఉదయం కెరీర్ లో తొలి సెంచరీ సాధించిన కరణ్ నాయర్, మధ్యాహ్నానికంతా డబుల్ సెంచరీ చేశాడు. రంజీల్లో రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించిన కరణ్ నాయర్ ను ఇన్నాళ్లు రిజర్వ్ బెంచ్ లో ఉంచారు. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకోవడంతో అప్రాధాన్యత కలిగిన ఐదో టెస్టులో అవకాశం ఇచ్చారు. దీనిని సానుకూలంగా మార్చుకున్న కరణ్ నాయర్ ఆద్యంతం వన్డే తరహా ఆటతీరుతో అద్భుతంగా ఆడి, డబుల్ సెంచరీ చేశాడు. ఇందుకోసం 308 బంతులు ఎదుర్కొన్న నాయర్ 23 ఫోర్లు ఒక్క సిక్సర్ సాయంతో 202 పరుగులు చేశాడు. అతనికి జతగా రవి చంద్రన్ అశ్విన్ (55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా 168 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 600 పరుగులు చేసింది. 

More Telugu News