: మరణశిక్షే విధించాలని కోర్టును కోరిన ఎన్ఐఏ అధికారులు.. ఎలాంటి శిక్ష‌యినా విధించుకోమ‌ని చెప్పిన దోషులు

మూడేళ్ల క్రితం జరిగిన దిల్‌సుఖ్ న‌గ‌ర్ జంట పేలుళ్ల కేసులో నేర‌స్తులుగా తేలిన ఐదుగురికి ఎన్ఐఏ న్యాయ‌స్థానం మ‌రికాసేప‌ట్లో శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది. శిక్ష‌పై ఇరువైపు వాద‌న‌లు పూర్తయ్యాయి. నాలుగు సెక్షన్ల కింద నేరం రుజువు అయింద‌ని ఎన్ఐఏ చెప్పింది. నేర‌స్తుల‌కు గ‌రిష్ట శిక్ష‌నే విధించాల‌ని, మరణ శిక్షే విధించాలని కోరింది. ఈ సందర్భంగా, నేర‌స్తులు చెప్ప‌ద‌లుచుకోవాల్సింది ఏమ‌యినా ఉందా? అని కోర్టు ప్ర‌శ్నించింది. నేర‌స్తులు అస‌దుల్లా అక్త‌ర్‌, వ‌కాస్‌, తెహ‌సీన్ అక్త‌ర్‌, యాసిన్ భ‌త్క‌ల్‌, ఐజాజ్ షేక్‌లు మాట్లాడుతూ తాము చెప్ప‌డానికి ఏమీ లేద‌ని, ఎలాంటి శిక్ష‌యినా విధించుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News