: లాయర్లకు జీతాలు కూడా ఇవ్వలేని ఢిల్లీ ప్రభుత్వం.. హైకోర్టు సీరియస్!

ఏకంగా 32 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు దాదాపు ఏడాది నుంచి ఢిల్లీ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. ఈ మధ్యనే ఈ విషయం ఢిల్లీ హైకోర్టు దృష్టికి వచ్చింది. దీంతో, కోర్టు సీరియస్ అయింది. జీతాలు ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతోందో తెలపాలంటూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖలను కోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు జీతాలు ఇవ్వకపోవడం అత్యంత దారుణమని... జీతాలు లేకుండా వారు విధులు నిర్వహించడం అసాధ్యమని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య నడుస్తున్న గొడవే దీనికి కారణమని తెలుస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలను పెంచుతూ గతంలో ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, నగర పాలన విషయంలో అత్యున్నత అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ దే అని ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో... ఆ ఫైలు పెండింగులో పడిపోయింది.

More Telugu News