crime: పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు

జగిత్యాలలోని తిమ్మాపూర్‌లో ఈ రోజు దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువ‌తిపై ఓ యువ‌కుడు కత్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువ‌తికి తీవ్రగాయాలయ్యాయి. వెంట‌నే ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న పోలీసులు  గాయాల‌పాల‌యిన యువ‌తిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తరలించారు. ఆమెపై దాడి చేసిన యువ‌కుడిని రాకేష్‌గా గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News