hari babu: రెండు ల‌క్ష‌ల ఏటీఎంలు అందుబాటులోకి వ‌చ్చాయి: ఎంపీ కంభంపాటి

పెద్దనోట్ల రద్దు అంశంపై  విపక్ష పార్టీలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తూ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయ‌ని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల నిరోధానికే కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటూ ముందుకువెళుతోందని ఆయ‌న అన్నారు. నోట్ల‌ను దారి మళ్లించిన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటుందని, దేశ వ్యాప్తంగా రెండు ల‌క్ష‌ల ఏటీఎంలు అందుబాటులోకి వ‌చ్చాయని కంభంపాటి అన్నారు.

 సినిమా థియేట‌ర్ల‌లో జాతీయ గీతాలాప‌న‌, జేఎన్‌యూ, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో గ‌తంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌పై జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హ‌రిబాబు స్పందిస్తూ..  ఏ వ‌ర్సిటీల విష‌యంలోనూ బీజేపీ క‌ల‌గ‌జేసుకోలేద‌ని అన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి, కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

More Telugu News