air force plane crashes: ప‌పువాలో వైమానికదళ శిక్ష‌ణ‌ విమానం కూలి 13 మంది మృతి

ఇండోనేషియాలోని ప‌పువాలో ఈ రోజు ఉద‌యం వైమానికద‌ళ విమానం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో వైమానికదళ శిక్ష‌ణ‌లో ఉన్న 13 మంది మృతి చెందిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ రోజు ఉద‌యం టిమికా ప్రాంతం నుంచి వైమానికదళ శిక్ష‌ణ విమానం హెర్క్యులస్-సీ130 బ‌య‌లుదేరి మ‌రికాసేప‌ట్లో వామెనా ప్రాంతానికి చేరుకునే క్ర‌మంలో ఉద‌యం 6.15 గంట‌ల‌కు ఇది కుప్ప‌కూలిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

More Telugu News