: పేపర్లు వేసిన వ్యక్తి రాష్ట్రపతి, టీ అమ్మిన వ్యక్తి ప్రధాని ఎందుకయ్యారో చెప్పిన వెంకయ్యనాయుడు

విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ శనివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆసక్తికర ప్రసంగంతో ఆకట్టుకున్నారు. పేపర్లు పంచిన వ్యక్తి రాష్ట్రపతి, రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన వ్యక్తి ప్రధాని కావడం వెనక వారి లక్ష్యం, కృషి అంతకుమించిన పట్టుదల ఉన్నాయని తెలిపారు. తాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమేనని అన్నారు. ఇసుకలో అక్షరాలు దిద్ది, దీపం బుడ్డీ వెలుతురులో తాను చదువుకున్నానని తెలిపారు. వాజ్‌పేయి సభలకు తరలిరావాలని మైకులో ప్రచారం చేసిన తాను ఆయనతో కలిసి పనిచేయడం వెనక కృషి, పట్టుదల ఉన్నాయన్నారు. శనివారం ఏయూలోని న్యాయ కళాశాల బెంచీలపై కూర్చున్నప్పుడు తల్లిఒడిలో ఉన్నంత అనుభవాన్ని పొందానని తెలిపారు. ఈ సందర్భంగా ‘హడ్కో’ తరపున ఏయూకు కోటి రూపాయల సాయాన్ని వెంకయ్యనాయుడు ప్రకటించారు.

More Telugu News