: నోట్ల రద్దుతో నిద్రకు దూరమయ్యా.. కేసీఆర్ ఆవేదన

నోట్ల రద్దుతో తాను కంటినిండా నిద్రకు కూడా దూరమయ్యానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుకు ముందు తాను కంటి నిండా నిద్రపోయేవాడినని, కానీ ప్రస్తుతం నిద్రపట్టడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి తనకు ఆవేదన కలిగిస్తోందన్నారు. శనివారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు తర్వాత రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, ఫలితంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, అంతవరకు ఓపిక పట్టాలని అన్నారు. ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టినప్పుడు ఇటువంటి సమస్యలు కూడా వస్తాయని, త్యాగాలు చేయక తప్పదని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  పడిన ప్రభావం జనవరిలో తెలుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.

More Telugu News