bsnl: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్

టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో ఇచ్చిన పోటీతో మిగ‌తా టెలికాం కంపెనీలు కూడా త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందుకు భారీ ఆఫ‌ర్లు తీసుకొస్తున్నాయి. ఈ విధంగా మార్కెట్లో త‌మ వినియోగ‌దారుల సంఖ్య త‌గ్గిపోకుండా చూసుకుంటున్నాయి.  ఇప్ప‌టికే ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలు అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా అదే బాట‌లోకి అడుగుపెట్టింది. త‌మ‌ ప్రీపెయిడ్ వినియోగ‌దారుల ముందు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ను తీసుకొచ్చింది. త‌మ వినియోగ‌దారులు ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే కేవ‌లం రూ.99తో రీచార్జ్ చేసుకొని, నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్,  300 ఎంబీ డేటా కూడా ఉచితంగా పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఈ ఆఫ‌ర్ అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్, కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ నెట్వర్క్ పరిధిలోని కాల్స్కు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది. కాగా, ఇదే ఆఫర్‌ను ఇతర సర్కిళ్లలో కూడా రూ.119 నుంచి రూ.149తో రీచార్జ్ చేసుకుంటే పొంద‌వ‌చ్చ‌ని చెప్పింది.

ఈ ఆఫ‌ర్‌తో పాటు తాము త‌మ వినియోగ‌దారుల ముందు కొత్త కాంబో ఎస్టీవీ ఆఫర్ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు పేర్కొంది.
ఈ ఆఫర్‌తో వినియోగదారులు పొందే స‌దుపాయాలు:
 రూ.339 రీచార్జ్‌తో నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్
 బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్వర్క్కైనా చేసుకునేలా 1జీబీ డేటా ఫ్రీ

More Telugu News