: రష్యాను హెచ్చరించిన ఒబామా.. రహస్యంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బహిరంగంగా, రహస్యంగా రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. అమెరికా ఎన్నికల సమగ్రతపై ప్రభావం చూపేందుకు కొన్ని విదేశీ ప్రభుత్వాలు ప్రయత్నించాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. సైబర్ దాడులపై తన అభిప్రాయాలేమిటో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలుసన్నారు. తాను నేరుగా ఆయనతోనే మాట్లాడానని ఒబామా పేర్కొన్నారు.

More Telugu News