: ‘చిన్నమ్మ’కు జై కొడుతున్న ఎమ్మెల్యేలు.. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే‌లో ప్రారంభమైన ‘రాజకీయాలు’ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరు కోసం జయ నెచ్చెలి శశికళ, ఆమె వ్యతిరేక వర్గం మధ్య మొదలైన అంతర్గత పోరులో చివరికి ‘చిన్నమ్మే’ విజయం సాధించినట్టు కనిపిస్తోంది. పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవడంలో శశికళ విజయం సాధించారు. ఆమెకు జై కొడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 130 మంది ఎమ్మెల్యేలు జయ నివాసమైన పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలంటూ ఆమెను అభ్యర్థించారు. మరోపక్క శశికళ వారసత్వానికి సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ ప్రకటించడం విశేషం.

More Telugu News