: పొరపాటున కూడా సినిమా తీయొద్దని అక్కినేని చెప్పారు: నటుడు లక్ష్మీకాంత్

‘పొరపాటున కూడా నువ్వు సినిమా తీయొద్దు’ అని అక్కినేని నాగేశ్వరరావు నాడు తనతో చెప్పారని‘ కన్నెమనసులు’ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ లక్ష్మీకాంత్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను  చాలా బాగా ప్రోత్సహించేవారు. ఆయనతో కలిసి మొట్టమొదట ‘ఆదర్శకుటుంబం’, ఆ తర్వాత ‘ఆలుమగలు’, ‘నాయకుడు-వినాయకుడు’ చిత్రాల్లో నటించాను. సినిమాల మీద బాగుపడ్డవాళ్ల కంటే దెబ్బతిన్నవాళ్లే ఎక్కువ. అయితే,   చిన్న బడ్జెట్ చిత్రాల రైట్స్ తీసుకుని డబ్బింగ్ చేయడం ద్వారా డబ్బులు మిగులుతుండేవి. కానీ, స్ట్రయిట్ చిత్రం తీయాలంటే డబ్బుపై మన కంట్రోల్ ఉండదు. ప్రొడ్యూసర్ పడే బాధలు ప్రాక్టికల్ గా చూశాను. దీంతో, సినిమా తీసే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ కలగలేదు. నాగేశ్వరరావు గారు చెప్పిన సలహాను పాటించాను ’ అని లక్ష్మీకాంత్ చెప్పారు.

More Telugu News