: ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట అయిన తర్వాత థియేటర్ చప్పట్లతో మార్మోగిపోయింది: నాటి నటుడు లక్ష్మీ కాంత్

 ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ అనే పాట అయిపోయిన తర్వాత థియేటర్ లో చప్పట్లు మార్మోగిపోయాయని ‘కన్నెమనసులు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నాటి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు లక్ష్మీకాంత్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను గుంటూరు హిందూ కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు నేను నటించిన ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే, నా ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్ లో చూసేందుకు వెళ్లాను. ‘ఏ దివిలో వెరిసిన పారిజాతమో..’ అనే పాట వస్తున్నంత సేపు థియేటర్ లో ప్రేక్షకులు ఎంతో సైలెంట్ గా ఉన్నారు. ఆ పాట అయిపోయిన తర్వాత ప్రేక్షకులందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం నేను మరిచిపోలేను’ అని నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు తాను నలభై నుంచి నలభై ఐదు చిత్రాల్లో నటించానని చెప్పుకొచ్చారు.

More Telugu News